- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Miss World: హైదరాబాద్‌కు తరలివస్తున్న అందగత్తెలు.. మిస్ బ్రెజిల్‌కు ఘన స్వాగతం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల సుందరీమణులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న (Miss World) మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల సుందరీమణులు (Hyderabad) హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. కొన్ని రోజుల్లో జరగనుండటంతో ప్రపంచ దేశాల అందగత్తెలు ఒక్కొక్కరుగా అడుగుపెడుతున్నారు. ఇప్పటికే పలు దేశాల బ్యూటీలు భాగ్యనరంలో వాలిపోయారు. తాజాగా మిస్ బ్రెజిల్ జెస్సికా స్కాండియుజి పెడ్రోసో (Ms. Jessica Scandiuzzi Pedroso (Brazil)) నగరానికి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఈ ముద్దుగుమ్మకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాలతో అధికారులకు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో 120 దేశాల ప్రతినిధులు పాల్గొనడమే కాకుండా 150 పైగా దేశాల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ పోటీల ద్వారా తెలంగాణ కల్చర్‌ను ఇతర దేశాలకు తెలిసేలా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ పర్యాటక శాఖ దీనికోసం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల ఎనిమిదో తేదీ వరకు పోటీలలో పాల్గొనే భామలు హైదరాబాద్ చేరుకోనున్నారు.
ఈ నెల 10న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నెల 13 వ తేదీన చార్మినార్, లాడ్ బజార్‌లో అందగత్తెలతో హెరిటేజ్ వాక్ జరగనుంది. ఇక అదే రోజు చౌమొహల్లా ప్యాలెస్‌లో మ్యూజికల్ కాన్సర్ట్, వెల్‌కమ్ డిన్నర్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరుసటి రోజు నుంచి వరంగల్ వేయి స్తంభాల గుడి, అక్కడి కోట, రామప్ప ఆలయం సందర్శించనున్నారు. మరుసటి రోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ సందర్శన ఉంటుంది.
ఈ సందర్శనలో పోచంపల్లి లాంటి తెలంగాణలో ప్రసిద్ధమైన చీరలను కట్టనున్న తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లల మర్రి, ఏకో టూరిజం పార్కు, రామోజీ ఫిల్మ్‌సిటీ, తెలంగాణ సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, టీహబ్, శిల్పారామంను విజిట్ చేయనున్నారు. ఈ నెల 21న ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ చూడనున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ వీరి పర్యటన కొనసాగనుంది. మే 31వ తేదీన ఫైనల్స్ జరగనున్నాయి. ఆ రోజే విజేత ఎవరు అనేది తేలనుంది.






