ఆ 5 గ్రామాలను టీజీలో కలపండి.. అమిత్ షాకు తుమ్మల లేఖ

by Prasad Jukanti |   (  Updated:2026-04-05 12:08:43  IST  )

భద్రాచలం పక్కనున్న 5 గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు.

ఆ 5 గ్రామాలను టీజీలో కలపండి.. అమిత్ షాకు తుమ్మల లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఖమ్మం జిల్లా భద్రాచలం మండలానికి ఆనుకుని ఉన్న 5 గ్రామాలను తెలంగాణలో కలిపే అంశం మరోసారి చర్చనీయాశంగా మారింది. ఈ అంశంపై తాజాగా ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. భద్రాచలం పక్కనున్న 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని అందులో కోరారు. పాలనా సౌలభ్యం కోసం వీటిని భద్రాచలంలో కలపాలని ఇలా చేయడం ద్వారా గిరిజనుల సమస్యలు తొలగుతాయని పేర్కొన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే విలీనం బిల్లు పెట్టేలా చూడాలని కోరారు.

ఇటీవలే పార్లమెంట్‍లో ప్రస్తావన:

కాగా గత గుువారం ఏపీ రాజధాని అమరావతి చట్టబద్దత బిల్లుపైన రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా భద్రాచలం ఐదు గ్రామాలు తెలంగాణకే ఇవ్వాలని టీజీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కేంద్రాన్ని కోరారు. ఏపీ విభజన హామీలను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని, హామీలను అమలు చేయనందుకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె నిలదీశారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను విస్మరించారని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎన్టీపీసీ హామీలను నెరవేర్చలేదని రేణుకా చౌదరి విమర్శించారు. తెలంగాణకు మొండి చెయ్యి చూపిస్తున్నారని, ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని, తెలంగాణలో ఉండాలనుకునే వాళ్లను ఏపీలో కలిపారని ఆమె తెలిపారు.

భవిష్యత్తులో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ

Next Story