కోర్టు కేసీఆర్‌కు క్లీన్‌చిట్ ఇవ్వలేదు: మంత్రి ఉత్తమ్

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-22 10:04:10  IST  )

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావులకు ఊరట కల్పించింది.

కోర్టు కేసీఆర్‌కు క్లీన్‌చిట్ ఇవ్వలేదు: మంత్రి ఉత్తమ్
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావులకు ఊరట కల్పించింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎలాంటి నిబంధనలూ పాటించలేదని కోర్టు పేర్కొంది. నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని ఆదేశించింది. తాజాగా ఈ తీర్పుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ‘మాకు వచ్చిన రిపోర్ట్‌లలో మూడు బ్యారేజీలలో ఫాల్ట్ ఉంది. ఇదే విషయాన్ని కమిషన్ స్పష్టంగా చెప్పింది. ఇవాళ కోర్టు ఎవరికీ క్లీన్ షీట్ ఇవ్వలేదు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును కూడా హైకోర్టు తప్పు బట్టలేదు. కమిషన్ నియామకాన్ని పూర్తిగా సమర్థించింది. కోర్టు తీర్పుపై రేపు కేబినెట్‌లో చర్చ జరుపుతాం. కేబినెట్ చర్చ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటన చేస్తాం’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీలో అవకతవకలపై విచారణ నిమిత్తం జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ను నియమిస్తూ 2024 మార్చి 14న జారీ చేసిన జీవో 6ను సవాలు చేస్తూ కేసీఆర్, హరీశ్‌రావు, స్మితా సభర్వాల్, ఎస్‌.కే.జోషిలు పిటిషన్‌లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. నేటి తీర్పుతో కేసీఆర్‌, హరీశ్‌రావుతోపాటు స్మితా సబర్వాల్‌, ఎస్‌.కె.జోషిలకు కూడా కోర్టు ఊరట లభించింది.

కాళేశ్వరం కేసులో కీలక మలుపు.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకు రేవంత్ సర్కార్?

Next Story