- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరం కేసులో కీలక మలుపు.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకు రేవంత్ సర్కార్?
రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ భేటీలో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై సుప్పీంకోర్టులో సవాల్ చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాళేశ్వంరం ప్రాజెక్టు అంశం హాట్ టాపిక్‍గా మారింది. ఈ ప్రాజెక్టు అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు విషయంలో ఇవాళ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌తో పాటు పలువురు అధికారులపై ఎలాంటి చర్యలూ చేపట్టవద్ధంటూ ఆదేశించింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
రేపు కెబినెట్‍లో చర్చ:
రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగబోతోంది. ఈ సమావేశంలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్ల తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణతో పాటు, ఆర్టీసీ సమ్మె తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.






