ఎంత సేపు సినిమా ఆలోచనలేనా?.. కేటీఆర్‍కు మంత్రి సీతక్క కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2026-06-22 06:14:48  IST  )

కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ చేసిన 'సినిమా' వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ అబద్ధాల పుట్ట అంటూ మండిపడ్డారు.

ఎంత సేపు సినిమా ఆలోచనలేనా?.. కేటీఆర్‍కు మంత్రి సీతక్క కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సినిమా సగం సినిమా అట్టర్ ప్లాప్ అయిందని మిగతా సగం సినిమా మాత్రమే మిగిలి ఉందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క (Seethakka) కౌంటర్ ఇచ్చారు. ప్రజా పాలన నాయకుడిని సినిమాతో పోల్చడం కేటీఆర్ సినిమా ఆలోచనలకు నిదర్శనమని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో ఎంపీడీవో నూతన భవనాన్ని ఇవాళ ప్రారంభించిన సీతక్క, కే.టి. రామారావు చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ అబద్ధాల పుట్టగా మారిందని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా డ్రామాలు చేయడం మానేసి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచించారు. కేటీఆర్ ఆలోచనలు అమలు కాకపోతే మా పాలన విఫలమైనట్టా? అని ప్రశ్నించారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ నేతలు దిట్ట అని విమర్శించారు. మాది పేదల,రైతుల ప్రభుత్వం అన్నారు. ఈ దేశంలో రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. గతంలో వైఎస్సార్ ప్రభుత్వంలో రుణమాఫీ జరిగితే ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో జరింగిందన్నారు. ఇప్పుడు డిమాండ్ ఉన్న వరినే సాగు చేసేలా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోందన్నారు.

సగం సినిమా అయిపోయింది: కేటీఆర్

Next Story