నిజామాబాద్ జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి

by Jakkula.Mamatha |

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఊట్పల్లిలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో భార్యాభర్తలు మృతి చెందారు.

నిజామాబాద్ జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఊట్పల్లిలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో భార్యాభర్తలు మృతి చెందారు. గ్రామానికి చెందిన జ్యోతి(40) అనే గృహిణి తను ఉతికిన బట్టలు దాబాపై ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్‌కు గురైంది. దీన్ని గమనించిన ఆమె భర్త సంజీవ్(46) భార్యను కాపాడేందుకు వెళ్లి ఆయన కూడా కరెంట్ షాక్ కు గురై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. మృతి చెందిన దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలున్నారు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరూ ఏక కాలంలో చనిపోవడంతో కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తల్లిదండ్రులను పోగొట్టుకున్న ముగ్గురు ఆడ పిల్లలు తల్లిదండ్రుల మృతదేహాలపై గుండెలు పగిలేలా రోదిస్తున్న దృశ్యం చూస్తున్న గ్రామస్తులంతా కంటతడి పెట్టుకున్నారు. అమ్మా, నాన్నలను తమకు దూరం చేసి దేవుడు తమకు తీరని అన్యాయం చేసాడని రోదిస్తుండటం అందరి హృదయాలను ద్రవింపజేసింది. రూరల్ ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story