ప్రేక్షకుల మైండ్ సెట్ మారింది.. అందుకే నా సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నా: సాయి దుర్గా తేజ్

by Mallepaka Hamsa |

ప్రస్తుతం ప్రేక్షకులు ఓటీటీల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో విభిన్నమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను విరివిగా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రేక్షకుల మైండ్ సెట్ మారింది.. అందుకే నా సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నా: సాయి దుర్గా తేజ్
X

దిశ, సినిమా: మెగా హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంబరాల ఏటిగట్టు’. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ చిత్రాన్ని రోహిత్ కెపి తెరకెక్కిస్తున్నారు. భారీ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రాన్ని ‘హనుమాన్’ ఫేమ్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా.. ఇందులో జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 1980ల నాటి రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో ఈ కథ సాగుతోంది. అణచివేతకు గురయ్యే గిరిజనులను కాపాడేందుకు బాలి అనే గిరిజన నాయకుడు ఎదురు తిరిగే కథాంశంతో భారీ అంచనాల మధ్య రాబోతుంది. అయితే ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన చాలా రోజులే అవుతున్నప్పటికీ విడుదలకు నోచుకోలేదు. పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీ గ్లింప్స్ తప్ప మరే అప్డేట్ రాకపోవడంతో.. రిలీజ్ ఆలస్యం కావడంతో పలు రకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సాయి దుర్గా తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ప్రేక్షకులు ఓటీటీల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో విభిన్నమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను విరివిగా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అన్ని రకాల జానర్‌లలో వస్తున్న సరికొత్త కంటెంట్‌ను ఫాలో అవ్వడం వల్ల, వారు సినిమా మేకింగ్, కథలపై ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారని చెప్పారు. ఈ ఓటీటీ విప్లవం వల్ల ప్రేక్షకుల ఆలోచనా విధానంలో కూడా చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ప్రేక్షకులకు ఉన్న ఈ నాలెడ్జ్ వల్లే, ఇప్పుడు తన సినిమాల విషయంలో తాను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సాయి దుర్గా తేజ్ వెల్లడించారు. పాతకాలపు రొటీన్ కథలను ఇప్పుడు జనాలు అస్సలు ఆదరించడం లేదని, వారిని మెప్పించాలంటే కథల ఎంపికలో అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించక తప్పదంటున్నారు. కేవలం సినిమాలు చేయాలనే తొందరతో కాకుండా, ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చేలా చేస్తానని అంటున్నారు. అందుకే తన తదుపరి ప్రాజెక్ట్‌ ‘సంబరాల ఏటిగట్టు’ విషయంలో లేట్ అయినా సరే.. పక్కా కంటెంట్‌తోనే ప్రేక్షకుల ముందుకు వస్తానని ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్ స్పష్టం చేశారు.

Next Story