- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిగ్గు లేకుండా ఇంకా ఆ పార్టీలో ఎందుకున్నారు: జనసేన ఎమ్మెల్యే ఫైర్
సిగ్గులేకుండా ఇంకా వైసీపీలో ఎందుకున్నారని మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, వంగాగీతను జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ ప్రశ్నించారు. కాపులకు ద్రోహం చేస్తున్నారంటూ పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు...

దిశ, వెబ్ డెస్క్: సిగ్గులేకుండా ఇంకా వైసీపీలో ఎందుకున్నారని మాజీ మంత్రులు పేర్ని నాని(Perni Nani), అంబటి రాంబాబు(Ambati Rambabu), వంగాగీత(Ganga Geetha)ను జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్(Janasena Mla Boli Setti Srinivas) ప్రశ్నించారు. కాపులకు ద్రోహం చేస్తున్నారంటూ పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 2014-19లో కాపులకు అప్పటి ముఖ్యమంత్రి కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తే 2019-2024లో అసెంబ్లీ సాక్షిగా అప్పటి సీఎ జగన్ మోహన్ రెడ్డి ఆ రిజరేషన్లు ఎత్తి వేసిన విషయం తమకు తెలియదా అని నిలదీశారు. కాపులకు న్యాయం జరిగితే కాపులతో ఉండాలని బోలిశెట్టి సూచించారు.
ఇక నుంచి కాపులతోనే ఉంటానని చెప్పగలడా..?
అన్ని కులాలు తనవే అనే పేర్ని నాని ఇక నుంచి కాపులతోనే ఉంటానని చెప్పగలడా అని బోలిశెట్టి మండిపడ్డారు. కాపులను పవన్ కల్యాణ్ నుంచి దూరం చేసే కుట్ర వైసీపీ నాయకులు చేస్తున్నారని ఆరోపించారు. రౌడీ షీటర్ సాయికృష్ణ తప్పు చేశారని, అతను కాపు కులమైతే మద్దతు ఇవ్వాలా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఎందుకు పోటీ చేశారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, జగన్ పిఠాపురం, తాడేపల్లి నుంచి పోటీ చేయగలరా అని సవాల్ విసిరారు. కాపులకు అన్యాయం జరిగింది వైసీపీలోనే అని బోలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.






