- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shocking: బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా
బ్రిటన్ (UK) ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సొంత లేబర్ పార్టీ నుంచే ఒత్తిడి పెరుగుతుండటంతో ప్రధాని పదవికి రాజీనామా చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్ (UK) ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సొంత లేబర్ పార్టీ నుంచే ఒత్తిడి పెరుగుతుండటంతో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతానని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. గత మే నెలలో జరిగిన స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘోర పరాజయం పాలుకావడం, దేశంలో ఆర్థిక మందగమనం, పెరుగుతున్న జీవన వ్యయం వంటి కారణాల వల్ల స్టార్మర్ నాయకత్వంపై పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సుమారు 100 మందికి పైగా లేబర్ పార్టీ ఎంపీలు ఆయనకు వ్యతిరేకంగా మారినట్లు తెలుస్తోంది.
మరోవైపు, స్టార్మర్‌కు బలమైన ప్రత్యర్థిగా భావించే ఆండీ బర్న్హామ్ ఇటీవల జరిగిన ఉపఎన్నికలో విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టడం స్టార్మర్‌కు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. పార్టీ శ్రేణులు బర్న్హామ్ వైపు మొగ్గు చూపుతుండటంతో, స్టార్మర్ తన కేబినెట్ సహచరులు, కుటుంబ సభ్యులతో చర్చించి రాజీనామా చేశారు. మరోవైపు పదేళ్లలో ఆరుగురు ప్రధానులు రాజీనామా చేయడం హాట్ టాపిక్‌గా మారింది.






