జంగంపేట మీదుగా నూతన బస్సు సర్వీసు ప్రారంభం

by Jakkula.Mamatha |

జిన్నారం మున్సిపల్ జంగంపేట మీదుగా ఉట్ల, సికింద్రాబాద్ నూతన బస్సు సర్వీసును ప్రారంభించారు.

జంగంపేట మీదుగా నూతన బస్సు సర్వీసు ప్రారంభం
X

దిశ, జిన్నారం: జిన్నారం మున్సిపల్ జంగంపేట మీదుగా ఉట్ల, సికింద్రాబాద్ నూతన బస్సు సర్వీసును ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ జనార్దన్, జంగంపేట కౌన్సిలర్ ఆశాదేవి విన్నపం మేరకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రత్యేక చొరవతో నూతన బస్సు సర్వీసును ప్రారంభించినట్టు చైర్మన్ జనార్ధన్ వెల్లడించారు. బస్సు సర్వీస్‌తో ఇక్కడి విద్యార్థులకు, మహిళలకు, చిరు వ్యాపారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెంకటేశం గౌడ్, బీఆర్ఎస్ కౌన్సిలర్‌లు ప్రభాకర్, రాజు, నాగరాజు, స్థానిక నాయకులు వెంకట్ రెడ్డి, దుర్గేష్ ,తదితరులు పాల్గొన్నారు.

Next Story