- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్‌కమ్! జీఎం నిర్ణయంపై కార్మిక సంఘాల ఆగ్రహం
ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ (GM) డెట్రాయిట్‌లోని తన ప్రధాన అసెంబ్లీ ప్లాంట్ లో తీసుకున్న ఒక సంచలన నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ డెట్రాయిట్‌లోని తన ప్రధాన అసెంబ్లీ ప్లాంట్‌లో తీసుకున్న ఒక సంచలన నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. అమెరికాకు చెందిన వాహన తయారీ సంస్థ జనరల్ మోటార్స్ (GM) తన డెట్రాయిట్‌లోని ఫ్యాక్టరీ జీరో ప్లాంట్‌లో 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో 50 ‘కోబోట్స్’ (Collaborative Robots)ను ప్రవేశపెట్టింది. వాహనాల అసెంబ్లీ లైన్‌లో బాడీ ప్యానెల్స్ అమర్చే పనుల్లో ఈ రోబోలు మిగిలిన ఉద్యోగులతో కలిసి పనిచేస్తున్నాయి. ఉత్పత్తి వ్యయాలను తగ్గించడంతో పాటు భద్రత, పనితీరు మెరుగుపరచడానికే ఈ చర్యలు చేపట్టినట్లు జీఎం యాజమాన్యం వెల్లడించింది. అయితే, ఉద్యోగాల కోత తర్వాత రోబోలను తీసుకురావడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
యునైటెడ్ ఆటో వర్కర్స్ (UAW) లోకల్-22 అధ్యక్షుడు జేమ్స్ కాటన్ మాట్లాడుతూ, ‘రోబోలు కార్మికుల ఉద్యోగాలను హరిస్తున్నాయి. మా సభ్యుల ఉపాధిని కాపాడాల్సిన అవసరం ఉంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ మందగించిన నేపథ్యంలో జీఎం ఆటోమేషన్‌పై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో 2026 తొలి త్రైమాసికంలో సంస్థ 4.25 బిలియన్ డాలర్ల లాభాన్ని నమోదు చేయడం గమనార్హం.






