- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే.. పవన్ కల్యాణ్‍కు మంత్రి పొన్నం కౌంటర్
తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే అన్నారు. ఈ ప్రాంతం మా తండ్రి, తాతల జాగీరు అని పవన్ మరోసారి తన అహంకారాన్ని ప్రదర్శించారని మండిపడ్డారు. ఇవాళ గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ తనకు ఏపీలోనే దిక్కులేదని పవన్ స్వయంగా అంగీకరించారన్నారు. తెలుగు రాష్ట్రాలు ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం. తెలంగాణ నవ నిర్మాణంతో పవన్ కల్యాణ్ తెలంగాణలో పీకేదేముందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణఅ బీఆర్ఎస్ లేదా బీజేపీ ఎవరో ఒకరు ఎంగేజ్ చేసుకున్న ఆర్టిస్ట్ అని, ఆయనకు సరైన స్క్రిప్ట్ ఇవ్వడం లేదన్నారు. సినిమాల్లో ఆర్టిస్టును స్క్రీన్ టెస్ట్ చేసినట్లు తెలంగాణ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ టెస్టు చేస్తున్నారనేది వాస్తవం అన్నారు.
మమ్మల్ని గెలికితే ఊరుకోం:
పవన్ కల్యాణ్ తెలంగాణకు రావడానికి వెళ్లడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజే గెలికి నవ నిర్మాణం పేరుతో సభ పెడుతామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు ఎప్పుడూ స్వాగితిస్తుందన్నారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామన్నారు. పవన్ ఎప్పుడైనా తెలంగాణకు మద్దతు ఇచ్చారా? తెలంగాణ అమరవీరులకు ఏనాడైనా అండగా నిలిచారా అని ప్రశ్నించారు.






