- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో జనసేన ‘సాధక్’ల నిరాశపై నాగబాబు ఆసక్తికరమైన ట్వీట్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు జనసేన నివాళులు. హైదరాబాదులో పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన వేడుకలకు అధికారుల అనుమతి నిరాకరణపై ఎమ్మెల్సీ నాగబాబు ట్వీట్

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో నిర్వహించ తలపెట్టిన జనసేన (Janasena) సభకు అనుమతి రాకపోవడంతో సభను రద్దు చేశారు. అనంతరం పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో జనసేన ‘సాధక్’ల నిరాశతో తిరుగుపయాణం అవ్వడంపై ఎమ్మెల్సీ నాగబాబు (MLC Nagababu) ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన తన ట్వీట్‌లో "తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా యావత్ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ నవ నిర్మాణం కోసం పోరాడుతున్న జనసైనికులకు, వీర మహిళలకు జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావజాలంతో, తెలంగాణ సమాజ శ్రేయస్సు కోసం గొంతుకగా నిలుస్తూ పోరాట పటిమ కనబరుస్తున్న శ్రేణులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు. అలాగే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టిన వేలాది మంది అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని నాగబాబు ప్రకటించారు.
అలాగే.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లో జనసేన ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుండి జనసేన "సాధక్"లు ఉత్సాహంతో నగరానికి తరలి వచ్చారు. అయితే, ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారుల నుండి ముందస్తు అనుమతులు లభించని కారణంగా తీవ్ర నిరాశ ఎదురైంది. పర్మిషన్ లేకపోవడంతో ఎలాంటి వేడుకలు నిర్వహించుకోకుండానే వచ్చిన వారంతా వెనుతిరగాల్సి వచ్చింది. ఎంతో ఆశతో, ఉత్సాహంతో వచ్చిన "సాధక్"లు వేడుకలు చేసుకోకుండానే వెనుతిరిగి వెళ్లడం వారిని తీవ్ర మనోవేదనకు గురిచేసిందని నాగబాబు తన ట్వీట్ లో చెప్పుకొచ్చారు.






