- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతు సంక్షేమమే ధ్యేయం.. మంత్రి పొన్నం
రైతులు ఎరువుల కోసం రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉండకూడదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

దిశ, హుస్నాబాద్ : రైతులు ఎరువుల కోసం రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉండకూడదని, వ్యవసాయాధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ వారికి దిశానిర్దేశం చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యానవన శాఖల అధికారులతో ఆయన సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎరువుల కొరత తలెత్తకుండా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మూడు జిల్లాల కలెక్టర్లతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. “ఎక్కడా ఎరువుల కొరత లేదు. రైతు వేదికలు, సహకార సంఘాలు, మహిళా సంఘాల ద్వారా ఎరువులు రైతులకు నేరుగా అందేలా చూడాలి. రైతులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడే దుస్థితి రాకూడదు” అని అధికారులను హెచ్చరించారు. పంటల సాగు, యాంత్రీకరణ, ప్రభుత్వ పథకాల అమలు పై పక్కాప్రణాళికతో ముందుకు సాగి, హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
ఆయిల్ పామ్ సాగు పై దృష్టి..
నర్మేటలో నూతనంగా నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు ఈ సాగు పై అవగాహన కల్పించాలని సూచించారు. రైతుల సౌకర్యార్థం నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఆయిల్ పామ్ కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పంటల సాగు విధానం, ఇతర సమస్యల పై జనవరి 26లోపు గ్రామ, మండల స్థాయి అధికారులు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
పాడి పరిశ్రమకు ప్రోత్సాహం..
మధిరలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన పశుసంపద అభివృద్ధి పథకాన్ని అధికారులు అధ్యయనం చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ పాడి గేదె ఉండేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. గొర్రెలకు డీ వార్మింగ్ 100 శాతం పూర్తి కావడం పై హర్షం వ్యక్తం చేస్తూనే, పశువులకు టీకాలు వేయడం, సంతానోత్పత్తి పెంచడానికి ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం పై శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఏఓ, ఏడీఏలు, ఏఓలు, వెటర్నరీ అధికారులు, ఉద్యానవన శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.
READ MORE .....






