సింగరేణిపై బీఆర్‌ఎస్‌ - బీజేపీ కుమ్మక్కు : మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపణలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-21 09:30:49  IST  )

తెలంగాణకు నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతోంది, కేంద్రాన్ని అడుగుదామంటే రమ్మంటే ప్రతిపక్ష నేతలెవ్వరూ ముందుకురారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

సింగరేణిపై బీఆర్‌ఎస్‌ - బీజేపీ కుమ్మక్కు : మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణకు నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతోంది, కేంద్రాన్ని అడుగుదామంటే రమ్మంటే ప్రతిపక్ష నేతలెవ్వరూ ముందుకురారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అలాంటి ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు సింగరేణిపై దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎలాంటి ఎంక్వైరీకైనా తాము సిద్ధంగా ఉన్నామని, దీనిపై విచారణ చేయాలని సీఎంను కోరుతామన్నారు.

హరీష్ రావుకు ఓపెన్ ఛాలెంజ్

బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని, ఆ రెండూ కలిసే తాము సేఫ్ గా ఉంటామని బీఆర్ఎస్ భావిస్తోందన్నారు. అందుకే కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారన్నారు. తీరా సీబీఐ విచారణకు ఇస్తే.. కిషన్ రెడ్డి, హరీష్ రావు కలిసి సింగరేణి అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఇప్పుడు ఈ విషయంపై సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి అలాట్మెంట్స్ ను తెప్పించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని పొన్నం ప్రభాకర్ హరీష్ రావు, కిషన్ రెడ్డిలను డిమాండ్ చేశారు. 2014 నుంచి సింగరేణిలో ఇచ్చిన ఒకే ఒక్క కాంట్రాక్ట్ తప్ప మిగతా కాంట్రాక్టులన్నీ ఎక్స్ ట్రాగానే ఇచ్చారని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇందుకు హరీష్ రావు సిద్ధమా? అని మంత్రి పొన్నం ఓపెన్ ఛాలెంజ్ చేశారు.

Read More... TG: తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. వరంగల్, ఆదిలాబాద్ విషయంలో సీఎం కీలక ప్రకటన

Master Card: హైదరాబాద్‍కు మరో అంతర్జాతీయ సంస్థ కార్యాలయం.. దావోస్ వేదికగా కీలక ప్రకటన

Next Story