Master Card: హైదరాబాద్‍కు మరో అంతర్జాతీయ సంస్థ కార్యాలయం.. దావోస్ వేదికగా కీలక ప్రకటన

by Prasad Jukanti |   (  Updated:2026-01-21 07:45:06  IST  )

హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ సంస్థ కార్యాలయం వచ్చింది.

Master Card: హైదరాబాద్‍కు మరో అంతర్జాతీయ సంస్థ కార్యాలయం.. దావోస్ వేదికగా కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్లోబల్ ఫిన్‌టెక్, బీఎఫ్ఎస్ఐ రంగాలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. తాజాగా హైదరాబాద్ నగరంలో మరో అంతర్జాతీయ సంస్థ కార్యాలయం ప్రారంభమైంది. ప్రముఖ గ్లోబల్ పేమేంట్స్ దిగ్గజ కంపెనీ మాస్టర్ కార్డ్ (Mastercard) తన కార్యాలయాన్ని హైదరాబాద్‍లో (Hyderabad Office) ప్రారంభించింది. దావోస్‍‍లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (Davos WEF) వేదికగా మాస్టర్ కార్డు సీఈవో మైఖేల్ మీబాచ్ (Michael Miebach) ఈ కీలక ప్రకటన చేశారు. ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆయన డిజిటల్ ఎకనామీ, సెబర్ సెక్యూరిటీ రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని చెప్పారు. భార్త ను ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఎకనామీగా అభివర్ణించారు. సైబర్ సెక్యూరిటీపై భారత్ దృష్టి సారించడం మా సంస్థకు సానుకూల అంశం అన్నారు. ఇండియాలో హైదరాబాద్ లో మాస్టర్ కార్డు తాజాగా కార్యాలయాన్ని ప్రారంభించడంతో పాటు ఏఐ గ్యారేజ్ ను విస్తరించడం ద్వారా భారత్ విషయంలో కమిట్‍మెంట్ తో ఉందని చెప్పారు.

అనిశ్చితిలోనూ వృద్ధి:

టారిఫ్‌లు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలపై ఆందోళనలు ఉన్నప్పటికీ 2025లో ప్రపంచ జీడీపీ 3.2 శాతం వృద్ధి సాధించిందని మైఖేల్ మీబాచ్ తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో నేర్చుకున్న పాఠాలు, ప్రాంతీయంగా బలమైన సప్లై చైన్‍ల నిర్మాణం వంటి అంశాలు ఈ స్థిరత్వానికి కారణమని అని పేర్కొన్నారు. వినియోగదారులు ఇప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటూన్నారని చెప్పారు. లాయల్టీ ప్రోగ్రామ్‌లు, ధరల పోల్చి చూపే వెబ్ సైట్లను వినియోగిస్తున్నారని చెప్పారు.

Read More..

ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్‌తో చిరంజీవి

Next Story