- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్‌తో చిరంజీవి
స్విట్జర్లాండ్లోని దావోస్ లో రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించడమే లక్ష్యంగా జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తో కలిసి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: స్విట్జర్లాండ్లోని దావోస్ లో రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించడమే లక్ష్యంగా జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తో కలిసి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. చిరంజీవి అక్కడే ఉన్న జ్యూరిక్ లో ఉన్నారని తెలుసుకున్న సీఎం రేవంత్.. ఆయన్ను కూడా ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఆహ్వానించారు. ఈ సదస్సులో ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను చిరంజీవి ఆసక్తిగా వీక్షించారు. అనంతరం ఆయనతో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కుటుంబంతో కలిసి మన శంకరవరప్రసాద్ గారు సినిమా చూశానని, చాలా బాగుందని చెప్పారు. ఈ సందర్భంగా చిరంజీవికి అభినందనలు తెలిపారు. కాగా.. ప్రస్తుతం చిరంజీవి స్విట్జర్లాండ్ లో ఫ్యామిలీ ట్రిప్ లో ఉన్నారు.
Read More..
హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సు.. ప్రతిపాదించిన సీఎం రేవంత్ రెడ్డి
Next Story






