హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సు.. ప్రతిపాదించిన సీఎం రేవంత్ రెడ్డి

by Malleboina Mahesh |   (  Updated:2026-01-21 05:50:02  IST  )

స్విడ్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఒక వినూత్న ప్రతిపాదన ఉంచారు.

హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సు.. ప్రతిపాదించిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: స్విడ్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) ఒక వినూత్న ప్రతిపాదన ఉంచారు. ప్రతి సంవత్సరం జూలై - ఆగస్టు నెలల్లో హైదరాబాద్‌లో 'మినీ దావోస్' తరహాలో ఫోరమ్ ఫాలో-అప్ సదస్సు (Forum follow-up conference)ను నిర్వహించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. పెట్టుబడి ఒప్పందాలు, వాణిజ్య నిర్ణయాలకు ఏడాది కాలం చాలా ఎక్కువని, అందుకే ఆరు నెలలకోసారి సమీక్షా సమావేశం అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు పలికారు.

ఇదే వేదికపై సీఎం 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ డాక్యుమెంట్‌ను ప్రదర్శిస్తూ, 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న 'భారత్ ఫ్యూచర్ సిటీ' మూసీ పునరుజ్జీవనం ద్వారా హైదరాబాద్‌ను 24 గంటలు పనిచేసే నగరంగా మారుస్తామని సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 'తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్' (TAIH), 'నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030'లను అధికారికంగా ఆవిష్కరించింది. 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో $250 బిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మెట్రో రైలు విస్తరణ, కొత్త ఆర్థిక వృద్ధి జోన్ల ప్రణాళికలను వివరించగా, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఈ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ముఖ్యమంత్రితో కలిసి విందులో పాల్గొన్నారు. ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఇప్పటికే రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, రానున్న రోజుల్లో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Read More..

దావోస్‌లో CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Next Story