- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిమాయత్‌నగర్ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం దంపతులు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేడు తెలంగాణ వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేడు తెలంగాణ వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కాగా హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరగా.. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. అలాగే వనస్థలిపురం శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యాదగిరిగుట్ట, భద్రాచలం, వారాసిగూడ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, నిజామాబాద్ జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేస్తే మోక్షం లభిస్తుందనే నమ్మకంతో భక్తులు శ్రద్ధాభక్తులతో స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
READ MORE ....
వైకుంఠ ఏకాదశి.. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు పోటెత్తిన భక్తులు






