వైకుంఠ ఏకాదశి.. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు పోటెత్తిన భక్తులు

by Muthe.Rajitha |   (  Updated:2025-12-30 10:08:22  IST  )

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలకు భక్తుల పోటెత్తారు.

వైకుంఠ ఏకాదశి.. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు పోటెత్తిన భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలకు భక్తుల పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీమహావిష్ణువు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు విజయవాడ కనకదుర్గ ఆలయం, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లోనూ భక్తులు భారీగా తరలివచ్చారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఘనంగా ప్రారంభమై, గరుడ వాహనంపై శ్రీరామచంద్రస్వామి, గజ వాహనంపై సీతమ్మ, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. విశాఖ జిల్లా సింహాచలంలో సింహాద్రి నాథుడు వైకుంఠ నారాయణుడి అలంకరణలో భక్తులను అనుగ్రహించగా, అదితి గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు.

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విప్ పి.గణబాబు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, నటుడు చిరంజీవి కుటుంబంతో పాటు కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా, క్రికెటర్ తిలక్ వర్మ వంటి పలువురు ప్రముఖులు శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు.

READ MORE ....

హిమాయత్‌నగర్‌ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి పొన్నం దంపతులు

Next Story