సమ్మక్క సారక్కను కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి పొంగులేటి

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-29 03:17:51  IST  )

మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెల మీదకు చేరుకోగా కన్నెపల్లి నుండి సారలమ్మ సైతం గద్దెవద్దకు చేరుకుంది.

సమ్మక్క సారక్కను కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి పొంగులేటి
X

దిశ, వెబ్ డెస్క్: మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెల మీదకు చేరుకోగా కన్నెపల్లి నుండి సారలమ్మ సైతం గద్దెవద్దకు చేరుకుంది. ఇక నేడు గిరిజన పూజారుల పూజలతో చిలుకల గుట్ట నుండి సమ్మక్క గద్దెపైకి వస్తుంది. ఈ ఘట్టంతో జాతర మొదలవుతుంది. కాగా సమ్మక్క సారలమ్మను సాధారణ భక్తులతో పాటు రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులు, పోలీసులను కలిసి వారికి పలు సూచనలు చేశారు. ఇక పొంగులేటి మేడారం జాతర ఏర్పాట్లలో కీలక పాత్ర పోశించిన సంగతి తెలిసిందే. జాతరలో మౌలిక సదుపాయాల కల్పన, ట్రాఫిక్ నియంత్రణ, 24/7 పర్యవేక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. మేడారంలో అభివృద్ధి ప‌నుల్లోనూ ఆయ‌న కీల‌క పాత్ర పోశించారు.

MORE NEWS : సమ్మక్క-సారలమ్మ మహాజాతర.. రేపు ములుగు జిల్లాలో సెలవు ప్రకటించిన కలెక్టర్

Next Story