సమ్మక్క-సారలమ్మ మహాజాతర.. రేపు ములుగు జిల్లాలో సెలవు ప్రకటించిన కలెక్టర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-29 03:19:18  IST  )

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర సందర్భంగా ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర కీలక నిర్ణయం తీసుకున్నారు.

సమ్మక్క-సారలమ్మ మహాజాతర.. రేపు ములుగు జిల్లాలో సెలవు ప్రకటించిన కలెక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క-సారలమ్మ (Sammakka-Saralamma) మహాజాతర సందర్భంగా ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర (TS Diwakara) కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతరలో ప్రధాన ఘట్టమైన అమ్మవార్ల కొలువు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రేపు జిల్లా వ్యాప్తంగా స్థానిక సెలవు ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, స్థానిక సంస్థలకు సెలవు వర్తించనుంది. ఇక ట్రెజరీ కార్యాలయాలు, అత్యవసర సేవా విభాగాలు మాత్రం యథావిధిగా పనిచేయనున్నాయి. రేపటి సెలవుకు బదులుగా వచ్చే నెలలో ఫిబ్రవరి 14న రెండో శనివారం జిల్లాలోని కార్యాలయాలు, పాఠశాలలు పనిదినంగా ఉంటాయని కలెక్టర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం సమ్మక్క అమ్మవారు చిలుకలగుట్ట (Chilakalagutta) నుంచి గద్దెకు చేరుకోనుండగా, రేపు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకునే అవకాశం ఉంది. జాతర సందర్భంగా తరలివస్తున్న అశేష భక్తజనానికి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాటు ఇప్పటికే పూర్తి చేసింది.

MORE NEWS : సమ్మక్క సారక్కను కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి పొంగులేటి

Next Story