కేసీఆర్ వదిలిన బాణం.. కవిత వ్యాఖ్యలపై మంత్రి వెంకట్ రెడ్డి కౌంటర్

by Ramesh Naini |   (  Updated:2026-01-02 07:07:07  IST  )

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్ వదిలిన బాణం.. కవిత వ్యాఖ్యలపై మంత్రి వెంకట్ రెడ్డి కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డిపై కవిత వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. ఇవాళ అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మంత్రి వెంకట్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ వదిలిన బాణం కవిత అని విమర్శించారు. కవిత కన్ఫ్యూజన్ లో ఉండి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తోందన్నారు. కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఊరూరా తిరుగుతోందని, కవిత టీఆర్ఎస్‌లో ఉందా? బయట ఉందా ఏ పార్టీలో ఉంది స్పష్టం చేయాలని ప్రశ్నించారు.

కేటీఆర్, హరీశ్‌రావు‌లను ఉరితిసినా తప్పు లేదా?

తన తండ్రి మీద సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కవిత హరీశ్ రావు మీద చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదు? అని నిలదీశారు. కేసీఆర్‌కు దగ్గరగా ఉన్న నాయకులు అందర్నీ దూరం చేసేందుకు కవిత విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తుందని ఆరోపించారు. కేసీఆర్‌ను ఉరితీసినా తప్పు లేదన్న దానికి రక్తం మరిగిపోయిందన్న కవిత.. కేటీఆర్, హరీశ్ రావు‌లను ఉరితిసినా తప్పు లేదా కవిత చెప్పాలన్నారు. బీఆర్ఎస్ నేతలందరినీ కోట్ల రూపాయలు దోచుకున్నావ్ అని కవిత విమర్శిస్తోందని అన్నారు. కేసీఆర్ సభకు రోజు వస్తే బీఆర్ఎస్ పుంజుకుంటుంది అని కవిత అంటోందని, కవిత బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు అనుమానం ఉందని చెప్పారు. కేసీఆర్‌ను తిడితే వస్తున్న కోపం హరీశ్ రావు ను తిడితే కవిత కు ఎందుకు రావడం లేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ తప్పు అని కవిత ఒప్పుకోవడం సంతోషం అని అన్నారు. బీఆర్ఎస్ హాయాంలో నల్లగొండ మంత్రి జిల్లాకు చేసిన అన్యాయంపై కవిత ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.

నాకు మా తమ్ముడితో ఎటువంటి గొడవలు లేవు

నాకు సీఎం అంటే గౌరవం అని, సీఎం రేవంత్ రెడ్డిని ఎవరు ఏమన్నా అంటే కౌంటర్ ఇస్తా అని మంత్రి చెప్పుకొచ్చారు. నాకు మంత్రి పదవి కావాలని ఎవరిని అడగలేదని, నాకు మా తమ్ముని మధ్య ఎటువంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. నేను మంత్రి పదవి కోసం ఏరోజు పాకులాడలేదని, తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసానని అన్నారు.

Read More : "ఆ మాట వింటే రక్తం మరుగుతోంది.. కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు"

Next Story