- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ మాట వింటే రక్తం మరుగుతోంది.. కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
బాధ్యతయుతమైన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాజీ ముఖ్యమంత్రి పట్టుకుని ఉరి తీయాలని అనడం సరికాదని తెలంగాణ జాగృతి చీఫ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: బాధ్యతయుతమైన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాజీ ముఖ్యమంత్రి పట్టుకుని ఉరి తీయాలని అనడం సరికాదని తెలంగాణ జాగృతి చీఫ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అన్నారు. ఇవాళ ఆమె శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన రాజీనామా ఆమోదించాలని కోరేందుకే తాను ఇవాళ శాసనమండలికి వచ్చానని తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కొట్లాడిన కేసీఆర్‌ను ఉరి తీయాలని అంటే రక్తం మరుగుతోందని అన్నారు. అలా అయితే రేవంత్ రెడ్డిని ఒక్కసారి కాదు.. రెండు సార్లు ఉరేయాలని కామెంట్ చేశారు. కేసీఆర్‌ను కసబ్‌తో పోల్చడం తప్పని.. ఓ ఉద్యమ నాయకుడిపై మాట్లాడే ముందు రేవంత్ ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని కవిత అన్నారు.
అసెంబ్లీ వేదికగా కృష్ణా జలాలపై కేసీఆర్ (KCR) మాట్లాడి అధికార పక్షం నోరు మూయించాలని కవిత అన్నారు. బీఆర్ఎస్‌లో బబుల్ షూటర్లకే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చారని ఫైర్ అయ్యారు. పార్టీ మనుగడ కొనసాగాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్నారు. నదీ జలాల అంశాన్ని పిల్లకాకుల మీద వదిలేయవద్దని అన్నారు. ఇక ఆర్థిక శాఖలో ఒక్క ఫైల్ 9 నెలలుగా పెండింగ్‌లో ఉందన్నారు. ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్‌పై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీ నాయకులు శాశ్వతంగా తెలంగాణ నీళ్లు ఎత్తుకెళ్లాలని చూస్తున్నారని.. ఆంధ్ర నేతలకు ఉన్న ఐక్యత తెలంగాణలో లేదని కవిత అన్నారు.
Read More : కేసీఆర్ వదిలిన బాణం.. కవిత వ్యాఖ్యలపై మంత్రి వెంకట్ రెడ్డి కౌంటర్






