బలగం సినిమా స్థాయిలో ఉంది: మంత్రి కోమటిరెడ్డి ప్రశంస

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-27 11:14:36  IST  )

బలగం సినిమా స్థాయిలో ఉంది: మంత్రి కోమటిరెడ్డి ప్రశంస

బలగం సినిమా స్థాయిలో ఉంది: మంత్రి కోమటిరెడ్డి ప్రశంస
X

దిశ, వెబ్‌డెస్క్: శివాజీ, నదదీప్, నందు, బిందూ మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దండోరా(Dandora Movie). ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందరూ ఊహించిన విధంగానే చిత్రానికి పాజిటివ్ టాక్‌ వచ్చింది. ప్రస్తుతం రోజురోజుకూ థియేటర్ల సంఖ్య పెరుగుతూ మంచి వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ సినిమాను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని తెలిపారు. ‘‘తెలంగాణ నేల నుంచి పుట్టిన ఈ చిత్రం సామాజిక అంశాలను మనసును తాకేలా ఆవిష్కరిస్తూ, తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలను కలుపుతుంది. గ్రామీణ జీవనశైలి, మనుషుల మధ్య ఉన్న సూక్ష్మ సంబంధాలను సహజంగా చూపిస్తూ నిజ జీవితానికి అద్దం పడుతుంది. మన చుట్టూ నిత్యం కనిపిస్తూనే పట్టించుకోని ఒక సామాజిక సమస్యను సున్నితంగా ప్రశ్నిస్తూ ఆలోచనకు దారితీసే సినిమా ‘దండోరా’. ‘బలగం’ తర్వాత అదే స్థాయిలో హృదయాన్ని తాకిన సినిమా ‘దండోరా’. వినోదంతో పాటు విలువైన సందేశం అందించిన దండోరా టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు’’ కోమటిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read More..

ఇండస్ట్రీలో నాపై కుట్ర జరుగుతోంది.. మరోసారి నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు

Next Story