- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊపందుకున్న వైన్స్ టెండర్లు.. నేడే లాస్ట్ డేట్
ఉమ్మడి మెదక్ జిల్లాలో వైన్స్ లు దక్కించుకోవడానికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. సెప్టెంబర్ 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే.

దిశ, సంగారెడ్డి బ్యూరో: ఉమ్మడి మెదక్ జిల్లాలో వైన్స్ లు దక్కించుకోవడానికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. సెప్టెంబర్ 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. నేటి అంతే శనివారం రాత్రితో టెండర్ల ప్రక్రియ ముగియనున్నది. అయితే మొదటి నుంచి కొంత స్లో గా కొనసాగిన దరఖాస్తులు శుక్రవారం మంచి రోజు ఏకాదశి కావడంతో భారీగా వచ్చాయి. ఒక్కరోజే ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం 243 వైన్స్ లు ఉండగా 2052 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు శనివారం ఇంకా భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. కాగా గతంలో రూ.2 లక్షలుగా ఉన్న టెండరు ఫీజును రూ.3 లక్షలకు పెంచారు. ఫీజు పెంపు దరఖాస్తుల పై ప్రభావం చూపనున్నదా అని భావించగా చివరి రోజు వరకు అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వస్తాయని అధికారులు చెబుతున్నారు.
*నేడు భారీగా దరఖాస్తులు..?
ఉమ్మడి జిల్లాలనే 243 వైన్స్ లకు శుక్రవారం వరకు 2052 దరఖాస్తులు రాగా శనివారం భారీగానే దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. ఉమ్మడి జిల్లాలో 12 వేల నుంచి 13 వేల వరకు ధరకాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. రూ.3 లక్షల ఫీజు ప్రభావం ఉండబోదని, అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వస్తాయని అధికారులు లెక్కలు వేస్తున్నారు.
--------------------------------
* ఉమ్మడి మెదక్ జిల్లాలో వైన్స్ లకు శుక్రవారం రాత్రి వరకు వచ్చిన ధరఖాస్తులు వివరాలు ఇలా...
--------------------------
జిల్లా వైన్స్ లు ధరఖాస్తులు
-----------------------------------
సంగారెడ్డి 101 2279
సిద్దిపేట 93 1249
మెదక్ 49 800
-----------------------------------
మొత్తం 243 4315
Read More..






