- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: లిక్కర్ షాపులకు రికార్డుస్థాయిలో అప్లికేషన్స్
2025–27 నూతన మద్యం షాపుల నిర్వహణకు చేపట్టిన ధరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శనివారంతో ముగియనుంది.

దిశ, వెబ్‌డెస్క్: 2025–27 నూతన మద్యం షాపుల నిర్వహణకు చేపట్టిన ధరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ శనివారంతో ముగియనుంది. రేపు శనివారం ఆఖరి రోజు కావడంతో అబ్కారీ భవన్‌లో హైదరాబాద్ డివిజన్ కౌంటర్ల ఏర్పాటు చేశారు. ధరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు ఉంటుందని జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని శనివారమే ధరఖాస్తులకు ఆఖరు తేదీగా ఎక్సయిజ్ శాఖ స్పష్టం చేసింది. అశవాహలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ధరఖాస్తులు అందజేయాని సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్సయిజ్ డివిజన్‌లలో ముందస్తూ ఏర్పాట్లు చేసినట్లు ఎక్సయిజ్ అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఒక్క రోజు రాష్ట్ర వ్యాప్తంగా 20వేల నుంచి 25వేల వరకు దరఖాస్తులు వచ్చినట్లు తెలుపుతున్నారు. మొత్తంగా 50వేల ధరఖాస్తులు వచ్చినట్లు ఎక్సయిజ్ శాఖ వెల్లడించింది. శనివారం మరో 50వేల ధరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ డివిజన్‌లోని సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లో 11 ఎక్సైజ్ స్టేషన్ల కింద 179 మద్యం షాపులకు 1,809 దరఖాస్తులు వచ్చినట్లు హైదరాబాద్ డిప్యూటి కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి పేర్కోన్నారు. సికింద్రాబాద్ డివిజన్‌లోని మద్యం షాపులకు దరఖాస్తులు వేయడానికి వచ్చే వారి వాహనాలు ఎగ్జిబిషన్‌లో పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రంగారెడ్డి డివిజన్‌లో పది వేల దరఖాస్తులు వచ్చాయని పేర్కోన్నారు. రాజకీయ పార్టీలు చేపట్టిన బంద్ నేపధ్యంలో శనివారం ఇబ్బందులు ఏర్పడితే ఆదివారం కూడా ధరఖాస్తుల స్వీకరణకు గడువు ఇవ్వాలని ధరఖాస్తుదారులు ఎక్సయిజ్ శాఖ అధికారులను కోరుతున్నారు.






