ఐర్లాండ్ చేతిలో ఓట‌మి.. శ్రేయ‌స్ అయ్య‌ర్ కు క్లాస్ పీకిన గంభీర్ !

by velandi.Saikiran |   (  Updated:2026-06-27 01:32:14  IST  )

ఐర్లాండ్ చేతిలో ఓట‌మి నేప‌థ్యంలో శ్రేయ‌స్ అయ్య‌ర్, గంభీర్ మ‌ధ్య కీల‌క సంభాష‌ణ జ‌రిగింది.

ఐర్లాండ్  చేతిలో ఓట‌మి.. శ్రేయ‌స్ అయ్య‌ర్ కు క్లాస్ పీకిన గంభీర్ !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐర్లాండ్ చేతిలో భారత్ 34 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సులభంగా సిరీస్ గెలుస్తామనుకున్న భారత్ కు షాక్ ఇచ్చిన ఐర్లాండ్, తొలి మ్యాచ్ లో విజయం సాధించి..చ‌రిత్ర సృష్టించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో పై చేయి సాధించిన ఐర్లాండ్, వరల్డ్ కప్ విజేతను మట్టి కరిపించింది. ఈ క్రమంలో భారత ప్రదర్శనపై విమర్శలు గుప్పుమంటున్నాయి. ఐర్లాండ్ ను భారత జట్టు సభ్యులు లైట్ తీసుకోవడమే కొంప ముంచిందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే, ఈ ఓటమి తర్వాత భారత డ్రెస్సింగ్ రూమ్ లో గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మధ్య సీరియస్ సంభాషణ జరిగింది. ఈ సంద‌ర్భంగా శ్రేయస్ అయ్యర్ కు గంభీర్ క్లాస్ పీకినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. శ్రేయస్ అయ్యర్ చెత్త కెప్టెన్సీ వల్ల, ఓడిందని గంభీర్ సీరియస్ అయినట్లు ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ, వీడియో మాత్రం బయటకు వచ్చింది. కాగా ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ మొదటి బ్యాటింగ్ చేసి, 183 పరుగుల టార్గెట్ ను భారత జట్టు ముందు పెట్టింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో 18.5 ఓవర్లు ఆడిన భారత్, 148 పరుగులు చేసి కుప్పకూలింది.

Next Story