'మా ఇంటి బంగారం 2' గురించి సూపర్ అప్డేట్ ఇచ్చిన రాజ్ నిడిమోరు

by Pulgam srinivas |

'మా ఇంటి బంగారం' సక్సెస్ ఈవెంట్‌లో రాజ్ నిడిమోరు సీక్వెల్‌పై కీలక అప్డేట్ ఇచ్చారు.

మా ఇంటి బంగారం 2 గురించి సూపర్ అప్డేట్ ఇచ్చిన రాజ్ నిడిమోరు
X

దిశ, వెబ్ డెస్క్: సమంత తాజాగా 'మా ఇంటి బంగారం' చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సమంతతో పాటు రాజ్ నిడిమోరు సంయుక్తంగా నిర్మించారు. ప్రారంభం నుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన తర్వాత కూడా ప్రేక్షకులను ఆకట్టుకుని ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని నిన్న రాత్రి చిత్రబృందం సక్సెస్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా రాజ్ నిడిమోరు మాట్లాడుతూ.. 'మా ఇంటి బంగారం' చిత్రానికి ప్రేక్షకులు అందించిన ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ప్రేక్షకుల స్పందన, వారి ఆనందాన్ని చూస్తుంటే ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచన వచ్చిందని వెల్లడించారు. ఇప్పటికే సీక్వెల్‌కు సంబంధించిన ఓ ఐడియా కూడా సిద్ధంగా ఉందని, ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదని అన్నారు. మరో రెండు సంవత్సరాల్లో 'మా ఇంటి బంగారం 2' ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సమంత గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. కొంతకాలం పాటు సినిమాలకు విరామం తీసుకోనున్నట్లు ఆమె ఇప్పటికే వెల్లడించింది. దీంతో ఆమె తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన అనంతరం 'మా ఇంటి బంగారం 2' షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Next Story