శాలిగౌరారంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

by Jakkula.Mamatha |

శాలిగౌరారం మండలంలో ఖాళీగా ఉన్న మూడు అంగన్వాడీ టీచర్ పోస్టులకు గురువారం నోటిఫికేషన్ విడుదలైనట్లు నకిరేకల్ ప్రాజెక్టు ఐసీడీఎస్ అస్రా అంజుమ్ ప్రకటనలో తెలిపారు.

శాలిగౌరారంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ,శాలిగౌరారం: శాలిగౌరారం మండలంలో ఖాళీగా ఉన్న మూడు అంగన్వాడీ టీచర్ పోస్టులకు గురువారం నోటిఫికేషన్ విడుదలైనట్లు నకిరేకల్ ప్రాజెక్టు ఐసీడీఎస్ అస్రా అంజుమ్ ప్రకటనలో తెలిపారు. మండలంలోని వల్లాల- 3 అంగన్వాడీ కేంద్రానికి ఓసి అభ్యర్థులు, శాలిగౌరారం(జాలోనిగూడెం)- 3 కేంద్రానికి బీసీ -బీ అభ్యర్థులు, శాలిగౌరారం మార్కెట్ కేంద్రానికి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. అభ్యర్థులు 10+2 విద్యారత కలిగి ఉండి 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ నెల 27 నుంచి జులై 10 సాయంత్రం ఐదు గంటలలోపు తమ దరఖాస్తులను ఆన్లైన్‌లో సమర్పించాలని ఆమె కోరారు.

Next Story