జార్జియా పార్లమెంట్‌లో రచ్చరచ్చ..అధికార, ప్రతిపక్ష ఎంపీలు ఫైటింగ్

by Malleboina Mahesh |

జార్జియా పార్లమెంట్‌లో ఎంపీల ముష్టియుద్ధం.. ప్రధాని సమక్షంలోనే గుద్దుకున్న అధికార, ప్రతిపక్ష నేతలు.. భీకర ఘర్షణ వీడియో వైరల్!

జార్జియా పార్లమెంట్‌లో రచ్చరచ్చ..అధికార, ప్రతిపక్ష ఎంపీలు ఫైటింగ్
X

దిశ, వెబ్ డెస్క్: జార్జియా దేశ పార్లమెంట్ (Parliament) శనివారం భీకర ఘర్షణకు వేదికైంది. ప్రధాని ఇరాక్లీ కొబఖిడ్జే (Irakli Kobakhidze) తన వార్షిక ప్రభుత్వ నివేదికను సభ ముందు ఉంచుతున్న సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య చెలరేగిన వివాదం కాస్త భౌతిక దాడికి దారితీసింది. అధికార 'జార్జియన్ డ్రీమ్' (Georgian Dream) పార్టీ, ప్రతిపక్ష 'ఫర్ జార్జియా' (For Georgia) పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు సభా మందిరంలోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.

ప్రధాని ప్రసంగం ముగిసిన అనంతరం ప్రారంభమైన ప్రశ్నోత్తరాల సమయంలో (Q&A Session) ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు దూషించుకుంటూ సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన ఎంపీలు షర్ట్‌లు పట్టుకుని, నడిసభలోనే పిడిగుద్దులు (Punches) కురిపించుకున్నారు. మార్షల్స్, ఇతర సభ్యులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను విడదీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పార్లమెంట్ లోపల ప్రజాప్రతినిధులు నడిరోడ్డుపై కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్న ఈ భీకర దాడులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ (Videos Viral) అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియో నెటిజన్లను విస్మయానికి గురి చేస్తోంది.

Next Story