- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణ:ఏవో అఖిల రెడ్డి
by Jakkula.Mamatha |
మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈ నెల 15వ తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఏవో అఖిల రెడ్డి రైతులకు తెలియజేశారు.

X
దిశ, నర్వ: మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈ నెల 15వ తేదీ వరకు కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఏవో అఖిల రెడ్డి రైతులకు తెలియజేశారు. అర్హులైన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి(AEO) మీ గ్రామాల్లో ఉండే రైతు వేదికల దగ్గరికి వెళ్లి కొత్తగా పాస్‌బుక్ పొందిన రైతులు రైతు భరోసాకు అప్లై చేసుకోవచ్చని తెలియజేశారు. లేదా మండల వ్యవసాయ అధికారి(MAO) కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రైతు దరఖాస్తుకు సమర్పించవలసిన పత్రాలు పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు పాస్‌బుక్, మొదటి పేజీ జిరాక్స్ కాపీ రైతు భరోసా దరఖాస్తు ఫారం అర్హులైన రైతులు ఆలస్యం చేయకుండా అవసరమైన పత్రాలతో దరఖాస్తు సమర్పించాలని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Next Story






