- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుస సెలవుల ఎఫెక్ట్.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్ధీ
వరుస సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది.

దిశ, వెబ్ డెస్క్: కలియుగ వైకుంఠం తిరుమల గిరులలో భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది. వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో, భక్తులు వెలుపల ఉన్న క్యూలైన్లలో సుదీర్ఘంగా వేచి ఉన్నారు. ఈ క్రమంలో ఎలాంటి టైం స్లాట్ టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి (ఉచిత దర్శనం) ప్రస్తుతం 24 గంటలకు పైగా సమయం పడుతోంది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే నిన్న ఒక్కరోజే మొత్తం 81,340 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారిలో భక్తిశ్రద్ధలతో స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న వారి సంఖ్య 44,874 గా నమోదైంది. అలాగే శ్రీవారి ఆలయ హుండీ కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే టీటీడీకి రూ. 3.76 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. వరుస సెలవుల రద్దీ దృష్ట్యా వృద్ధులు, చిన్న పిల్లలతో వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, దర్శన సమయాలను గమనించి తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.






