- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిబంధనలకు విరుద్ధంగా గూడ్స్ వాహనాల్లో కూలీల రవాణా.. పట్టించుకోని RTA అధికారులు!
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రం మీదుగా ప్రతి రోజు కూలీల రవాణా అక్రమంగా, అత్యంత ప్రమాదకరంగా సాగుతోంది.

దిశ, మల్దకల్: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రం మీదుగా ప్రతి రోజు కూలీల రవాణా అక్రమంగా, అత్యంత ప్రమాదకరంగా సాగుతోంది. నిబంధనల ప్రకారం.. కేవలం సరుకులు మాత్రమే రవాణా చేయాల్సిన గూడ్స్ ఆటోలను, ఇక్కడి డ్రైవర్లు ప్రయాణికుల రవాణాకు వాడుతున్నారు. లాభాల కక్కుర్తితో నిత్యం ఒక్కొక్క గూడ్స్ వాహనంలో సుమారు 50 మందికి పైగా కూలీలను గొర్రెల మందల్లా ఎక్కించి రోడ్లపైకి వదులుతున్నారు. అయినప్పటికీ, రవాణా శాఖ(RTA) అధికారులు మాత్రం ఈ దారుణాన్ని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల కేంద్రం గుండా ప్రతిరోజూ ఇన్ని వాహనాలు ఇంత ప్రమాదకరంగా వెళ్తున్నా, ఆర్టీఏ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ప్రాణాలు గాల్లోనే..
గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులకు ఎలాంటి రక్షణ ఉండదు. కనీసం కూర్చోవడానికి సీట్లు కూడా లేని ఆ వాహనాల్లో, కూలీలు ఒకరినొకరు పట్టుకుని నిలబడి ప్రయాణించాల్సి వస్తోంది. రోడ్డుపై వాహనం కొద్దిగా అదుపు తప్పినా ఊచకోత కోసినట్లు కూలీల ప్రాణాలు గాల్లో కలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరగకముందే RTA, మరియు స్థానిక పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి ఈ గూడ్స్ ఆటోల అక్రమ రవాణాను అరికట్టాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






