- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీర్‌పేట్ రహదారిపై ప్రయాణం నరకం
పేరుకేమో గ్రేటర్ హైదరాబాద్ ఆ రోడ్ల పరిస్థితి చూస్తే మాత్రం అత్యంత దారుణంగా త యారైంది.

దిశ, మీర్ పేట్ : పేరుకేమో గ్రేటర్ హైదరాబాద్ ఆ రోడ్ల పరిస్థితి చూస్తే మాత్రం అత్యంత దారుణంగా త యారైంది. వర్షం వచ్చిందంటే ఆ గుంతల రోడ్డుపై ప్రయాణం నరకం కనిపిస్తుంది. వాహనదారులకు, పాదాచారులకు ప్రజలు బోధిస్తున్న పాఠం అంతా ఇంతా కాదు.. ఆ రో డ్డుపై ప్రయాణం నరకంగా తయా రైంది. జనవరి నెలలో మీర్ పేట్ కార్పొరేషన్ ను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేసింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీలో విలీనం కావడం తో తమ ప్రాంతం అభివృద్ధిలో దూ సుకుపోతుంది. తమ ప్రాంతానికి నిధుల కొరత అసలే ఉండదు తమ వేగంగా అభివృద్ధి చెంది పనులు వే గంగా జరుగుతాయని అనుకున్న ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ లో ఏం జరగదు కార్పొరేషన్ ఉన్నపుడే బాగుండే అనుకునే వరకు పరిస్థితి తీసుకొచ్చారు అధికారులు, పాల కులు. బడంగ్ పేట్ సర్కిల్ పరిధిలోని మీర్ పేట్ కూడలి నుంచి జి ల్లెల గూడ వెళ్లే ప్రధాన రహదారి పై రోడ్డు గుంతలు పడి ఇటీవల కు రిసిన వర్షానికి గుంతల్లో నీళ్లు నిలవడంతో వాహనదారులకు, పాదాచారులను పట్ట పగలు నరకం కనిపిస్తుంది. ఆ రహదారిపై ప్రయాణం చేయాలంటే గుంతల రోడ్లతో ఏ స మయాన ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాణ్యతా ప్రమాణాలు ఎక్కడ?
జిల్లెలగూడ కనకదుర్గ ఆలయం నుంచి అల్మాస్ గూడ కమాన్ వరకు 2022లో రూ.7కోట్లతో గత ప్రభు త్వ హయాంలో వేసిన రోడ్డు కాం ట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పా టించకపోవడంతో రోడ్డు వేసిన నెలల వ్యవధిలోనే రోడ్డు గుంతలు గా మారింది. పర్యవేక్షించాల్సిన అ ధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశా రని రోడ్డు వేసిన నెల వ్యవధిలోనే గంతలమయంగా మారి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేషనే నయం ఉండే..
గుంతలు పడి నెలలు గడుస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని, మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉన్నప్పు డు తాత్కాలిక మరమ్మతులు చేసైనా అధికారులు చేతులు దులుపుకునేవారు. కానీ ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాదులో విలీనమైన తర్వాత అధికారుల తీరు మరింత దారుణంగా తయారైందని అధికారుల తీరుపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. డిప్యూటీ కమిషనర్ సమ్మయ్యతో సైతం రోజు ఇదే రహదారి గుంట వెళ్తూ ఉంటాడు.. కానీ ఆ రహదారిపై ఉన్న గుంతలు ఆ అధికారికి కనిపించ పోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని రోడ్డుకు త్వరితగతిన మరమ్మతులు చేపట్టి ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు లే కుండా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
అధికారులకు కనిపించడం లేదా?
ప్రధాన రహదారిపై గుం తలు ఏర్పడి రోజులు గడు స్తున్నా అధికారులకు కనిపించక పోవడం దారుణం. చిన్నపాటి వర్షం కురిస్తే గుం తల్లో నీరు నిలిచి వాహనదారు లు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి.
- తులసి ముఖేష్ ముదిరాజ్. మీర్ పేట్ బీజేపీ అధ్యక్షుడు






