- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscope:నేటి(27-06-2026) రాశి ఫలాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రోజు(శనివారం) 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం.

మేష రాశి
ఈరోజు మీకు చాలా ఆశాజనకంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తి అవుతాయి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
వృషభ రాశి
గ్రహానుకూలత బాగుంది. కానీ పని భారం ఎక్కువగా ఉండటం వల్ల కొంత ఓపిక అవసరం. సమయాన్ని సక్రమంగా వినియోగిస్తే అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఆరోగ్యం విషయంలో, ముఖ్యంగా కంటి సమస్యల పట్ల జాగ్రత్త వహించండి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
మిథున రాశి
మీ ఆత్మవిశ్వాసం, వేగవంతమైన నిర్ణయాలు విజయానికి దారి తీస్తాయి. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు చేతికి వచ్చే అవకాశం ఉంది. కళాకారులు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అయితే, పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు.
కర్కాటక రాశి
ఉద్యోగంలో అద్భుతమైన మార్పులు ఉంటాయి. అదృష్టం కలిసి వచ్చి పాత బాకీలు వసూలవుతాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావచ్చు. కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కొత్త ఆర్థిక పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సింహ రాశి
ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. సహోద్యోగుల పూర్తి సహకారం లభిస్తుంది. విలాసాల కోసం, విందు వినోదాల కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పై కొద్దిగా శ్రద్ధ పెట్టండి.
కన్య రాశి
ఈ రాశి వారికి ఇవాళ ఆర్థికంగా బాగుంటుంది. కెరీర్ పరంగా నూతన అవకాశాలు లభిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సమాజంలో మంచి పేరు, గౌరవం లభిస్తాయి. చిన్నపాటి మానసిక అలసట ఉంటుంది.
తుల రాశి
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి మంచి సమాచారం అందుతుంది. పాత పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు, సమయస్ఫూర్తి అవసరం. ఆన్‌లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
వృశ్చిక రాశి
ఈ రాశి వారు ఇవాళ మిక్కిలి ధైర్య సాహసాలతో ముందడుగు వేస్తారు. మీ సూక్ష్మబుద్ధితో పనుల్లో విజయాన్ని సాధిస్తారు. శత్రుబాధలు తొందరగా తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు మరియు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి.
ధనుస్సు రాశి
ఈ రాశి చెందిన విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆర్థికంగా రుణ లాభం పొందే అవకాశం ఉంది. ఎలర్జీ లేదా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఆరోగ్యం పట్ల మెలకువగా ఉండటం అవసరం.
మకర రాశి
ఈ రాశి వారికి ఇవాళ సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబ కలహాలు, ఇబ్బందులు దూరమవుతాయి. అందరితో స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగానే ఉంటాయి. అయితే, కొన్ని పనులలో ఆటంకాలు ఎదురవడం వల్ల వృధా ప్రయాణాలు, అలసట కలగవచ్చు.
కుంభ రాశి
ఈ రాశి వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగుతుంది. అధికారులు మీ పట్ల సామరస్యంగా వ్యవహరిస్తారు. వృత్తి, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అయితే, ఖర్చుల విషయంలో ఈరోజు చాలా నియంత్రణ అవసరం, బడ్జెట్ దాటకుండా చూసుకోండి.
మీన రాశి
ఈరోజు ఈ రాశి వారికి బాగుంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. బంధు, మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కావడంతో రోజంతా ఉత్సాహంగా గడుపుతారు.






