హైదరాబాద్‌లో రోడ్డుకు తన పేరు పెట్టడంపై స్పందించిన ట్రంప్

by Malleboina Mahesh |

హైదరాబాద్‌లో రోడ్డుకు ‘డోనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ’గా నామకరణం.. అపూర్వ గౌరవమంటూ భారత్‌కు ధన్యవాదాలు తెలిపిన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్!

హైదరాబాద్‌లో రోడ్డుకు తన పేరు పెట్టడంపై స్పందించిన ట్రంప్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా 250 వ స్వాతంత్ర్య దినోత్సవ (Freedom 250) వేడుకల సందర్భంగా ఐటీ హబ్ గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న అమెరికా కాన్సులేట్ (US Consulate) ప్రధాన రహదారికి ‘డోనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ’ (Donald Trump Avenue) గా అధికారికంగా నామకరణం చేశారు. ఈ నెల 23న రాత్రి జరిగిన 'ఫ్రీడమ్ 250' గాలా రిసెప్షన్ వేడుకలలో.. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, భారతదేశంలో యూఎస్ అంబాసిడర్ సెర్గియో గోర్ సంయుక్తంగా ఈ నూతన నామకరణ అధికారిక ఫలకాన్ని (Plaque) ఆవిష్కరించారు. కాగా రోడ్డుకు తన పెరు పెట్టడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. హైదరాబాద్‌లో ఒక ప్రముఖ మౌలిక సదుపాయాల రోడ్డు మార్గానికి అధికారికంగా తన పేరు పెడుతూ ‘డోనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ’ (Donald Trump Avenue) ను ఆవిష్కరించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దీనిని తనకు దక్కిన ఒక "అపూర్వమైన గౌరవం" (Unprecedented Honour) గా ట్రంప్ అభివర్ణించారు.

తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' (Truth Social) వేదికగా హైదరాబాద్‌లో జరిగిన ఈ రోడ్డు ప్రారంభోత్సవ వేడుకకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఫోటోను ట్రంప్ స్వయంగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేస్తూ.. "భారతదేశంలోని హైదరాబాద్‌లో నూతన 'డోనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ'.. ఈ అద్భుతమైన గౌరవానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!" అంటూ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఒక అమెరికా అధ్యక్షుడి పేరును భారత్‌లోని ఐటీ హబ్ నగరమైన హైదరాబాద్‌లో ఓ ప్రధాన రహదారికి పెట్టడం మరియు దానిని స్వయంగా ట్రంప్ సోషల్ మీడియాలో ప్రస్తావించడం ఇప్పుడు ఇటు రాజకీయంగా, అటు సామాజిక మాధ్యమాల్లో అంతర్జాతీయంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

Next Story