Bhadrachalam:రామాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం

by Jakkula.Mamatha |

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అభివృద్ధి పనులను శనివారం శ్రీకారం చుట్టారు.

Bhadrachalam:రామాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం
X

దిశ, భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అభివృద్ధి పనులను శనివారం శ్రీకారం చుట్టారు. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్‌లు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. తొలివిడత అభివృద్ధి పనులను రూ.200.89 కోట్లతో చేపట్టనున్నారు. ఈ పనులను వైఆర్‌కే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, ముందుగా తూర్పు, దక్షిణం, ఉత్తరం వైపు తొలగింపు పనులు ప్రారంభించారు. కాగా, తొలగింపుల అనంతరం మాస్టర్ ప్లాన్ ప్రకారం.. శాస్త్రోక్తంగా అభివృద్ధి పనులు చేపడతారు. వచ్చే సంవత్సరం శ్రీరామ నవమి నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

Next Story