- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరికొత్త క్యాప్షన్‌తో అక్షయ్ కుమార్ ‘హైవాన్’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
ఈ సినిమాను సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. ఇటీవల భూత్ బంగ్లాతో ఘన విజయం సాధించిన ఆయన.. కాస్త కూడా గ్యాప్ తీసుకోకుండా త్వరలోనే ప్రస్తుతం ‘వెల్ కమ్ టు ది జంగిల్’ చిత్రంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.మరోవైపు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ ‘హైవాన్’.ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సయామి ఖేర్, శ్రియా పిల్గాంకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఉన్న అత్యంత పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. దాదాపు 18 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ కలిసి ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో, ఇప్పుడు మళ్లీ వీరు కలిసి నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కెవిఎన్, థెస్పియన్స్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై వెంకట్ నారాయణ, శైలజ దేశాయ్ ఫెన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా మేకర్స్ స్పందిస్తూ.. "ఒక ధ్యాస.. ఒక అవిశ్రాంతి అన్వేషణ.. మీరు కచ్చితంగా గుర్తుంచుకోదగ్గ ఒక తేదీ" అంటూ ఒక పవర్‌ఫుల్ క్యాప్షన్‌ను కూడా జత చేశారు. అయితే, సెప్టెంబర్ 11న విడుదల కాబోతున్న ‘హైవాన్’ సినిమాకు టాలీవుడ్ నుండి గట్టి పోటీ ఎదురుకాబోతోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రణబలి’ సినిమా కూడా అదే సమయానికి విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో సెప్టెంబర్ రెండో వారంలో బాక్సాఫీస్ దగ్గర అక్షయ్ కుమార్ వర్సెస్ విజయ్ దేవరకొండల మధ్య గట్టి వార్ జరగబోతోందని అర్థమవుతోంది.






