- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ ప్రభుత్వంపై సోనియా గాంధీ తీవ్ర విమర్శలు
'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికకు రాసిన ఒక ప్రత్యేక కథనంలో సోనియా గాంధీ భారత విదేశాంగ విధానంలోని లోపాలను గట్టిగా ఎండగట్టారు.

దిశ, వెబ్ డెస్క్: కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) తీవ్ర విమర్శలు చేశారు. గాజాలో జరుగుతున్న ‘నరమేధం’ (Gaza Genocide) పై మోడీ ప్రభుత్వం (Modi Govt) వహిస్తున్న ‘రాయి లాంటి నిశ్శబ్దం’ (Stony Silence), నిష్క్రియ విధానం కేవలం నైతికంగా ఖండించదగినది మాత్రమే కాదని.. దేశ ప్రయోజనాల దృష్ట్యా కూడా దానికి ఎలాంటి హేతుబద్ధమైన కారణం లేదని ఆమె మండిపడ్డారు. 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికకు రాసిన ఒక ప్రత్యేక కథనంలో సోనియా గాంధీ భారత విదేశాంగ విధానంలోని లోపాలను గట్టిగా ఎండగట్టారు.
ఇజ్రాయెల్‌కు కేంద్రం ఇస్తున్న మద్దతు వల్ల పాలిస్తీనా, ఇరాన్, మధ్యప్రాచ్య (Middle East) దేశాల వంటి భారతదేశ చారిత్రాత్మక మిత్రదేశాలకు మనం దూరమయ్యామని సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ప్రపంచ ప్రజాభిప్రాయానికి భిన్నంగా నడుచుకుంటోందని.. ఈ శూన్యతను ఆసరాగా చేసుకుని పాకిస్తాన్ మధ్యవర్తిగా చొరబడేందుకు మోడీ ప్రభుత్వమే అవకాశం కల్పించిందని ఆమె విమర్శించారు. అంతేకాకుండా, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడికి దిగడానికి కొద్ది రోజుల ముందు.. ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్‌లో పర్యటించడం అత్యంత ‘భ్రమ కలిగించే వ్యూహాత్మక నిర్ణయం’ (Bewildering Strategic Decision) అని సోనియా గాంధీ అభివర్ణించారు.






