ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వ్యక్తి దారుణ హత్య.. క్షుద్రపూజలే కారణమా?

by Jakkula.Mamatha |

పదునైన మారణాయుధాలతో వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడి చేసి దారుణ హత్య చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రేవల్లి గ్రామ శివారులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వ్యక్తి దారుణ హత్య.. క్షుద్రపూజలే కారణమా?
X

దిశ, జడ్చర్ల /ఊర్కొండ: పదునైన మారణాయుధాలతో వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడి చేసి దారుణ హత్య చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రేవల్లి గ్రామ శివారులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రేవల్లి గ్రామానికి చెందిన కర్రోల్ల యాదయ్య(45) తిమ్మన్నపల్లి-రేవల్లి రోడ్డులో గ్రామానికి కూతవేటు దూరంలో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆ రహదారి గుండా వస్తున్న వ్యక్తి గుర్తించి వెంటనే గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామస్తులు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. బైకుపై వెళుతున్న యాదయ్య పై దారికాచి మారణాయుధాలతో దాడి చేసి ఉంటారని, బలమైన గాయాలతో అక్కడికక్కడే మృతి చెంది ఉంటాడని స్థానికులు చర్చించుకుంటున్నారు.

అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో కల్వకుర్తి సీఐ బీమ్‌కుమార్ ఎస్‌ఐ రమాదేవి సంఘటన స్థలానికి చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించి మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శనివారం ఉదయం మరోసారి ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ, ఎస్ఐలు క్లూస్ టీం ను రప్పించి నిందితుల ఆధారాల కొరకు అన్వేషణ చేపట్టారు. మృతుడు యాదయ్య పీర్ల పండుగ సందర్భంగా మిడ్జిల్ మండలంలోని బోయిన్పల్లి గ్రామంలో ఉంటున్న తన అక్క వద్దకు వెళ్లి పీర్ల పండుగ వేడుకలలో పాల్గొని రాత్రి 7:30 గంటల ప్రాంతంలో తన రుద్రమమైన రేవల్లికి ద్విచక్ర వాహనంపై పయనమయ్యాడని ఈ క్రమంలోని ఎనిమిది గంటల ప్రాంతంలో నిందితులు దారి కాచి పదునైన మరునాయగాలతో దాడి చేసి హత్య చేసి ఉంటారని స్థానికులతో పాటు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

యాదయ్య క్షుద్ర పూజలు చేస్తున్నాడనే గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణ ఉదంతానికి పాల్పడి ఉంటారని గ్రామస్తులు చర్చించుకుంటూ ఉండగా ఇంత ఆధునిక కాలంలో కూడా క్షుద్ర పూజలు మూఢనమ్మకాలను నమ్మడం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా హత్య ఉదంతం జరిగిన పరిసరాల్లోనే హత్య కంటే ముందు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూర్చుని మద్యం సేవిస్తూ గ్రామస్తులకు కనిపించారని ఆ మద్యం సేవించిన వ్యక్తులు ఎవరు అక్కడ కూర్చోవాల్సిన అవసరం ఏముంది అనే కోణంలో గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపడుతున్నారు. మృతుడు యాదయ్య సెంట్రింగ్ పనితో పాటు పురాతన సిసి స్లాబ్ రోడ్లను కూల్చే పనులు చేస్తూ జీవనం కొనసాగించేవాడని మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడని ఇద్దరు కూతుళ్ల పెళ్లి కాగా, కుమారుడు భార్యతో కలిసి గ్రామంలోనే నివాసం ఉండేవాడని స్థానికులు తెలిపారు. ఈ హత్య ఉదంతంతో రేవల్లి గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామం మొత్తం మొహరం పండుగ వేడుకల్లో నిమగ్నమై ఉండగా ఈ దారుణ ఘటన వార్త నిన్న గ్రామస్తులు హహకారాలతో ఘటన స్థలానికి చేరుకున్నారు.

Next Story