- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లైన నాలుగేళ్లకు గుడ్ న్యూస్.. హీరోయిన్ బేబీ బంప్ వీడియో వైరల్
కరిష్మా తన్నా ఒక అందమైన బ్లాక్ మ్యాక్సీ డ్రెస్‌ను ధరించారు. ఇందులో ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ కరిష్మా తన్నా, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త వరుణ్ బంగేరా త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ జంట తాము ప్రెగ్నెంట్ అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుండి కరిష్మా తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. తాజాగా ఈ జంట ముంబై వీధుల్లో ఒక సరదా డేట్ నైట్ ఎంజాయ్ చేస్తూ కెమెరాలకు చిక్కారు. ఇక ఇందులో కరిష్మా తన్నా ఒక అందమైన బ్లాక్ మ్యాక్సీ డ్రెస్‌ను ధరించారు. ఇందులో ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఆమె ముఖంలో తల్లి కాబోతున్న కళ స్పష్టంగా కనిపించింది. భర్త వరుణ్ చేతిని పట్టుకుని నడుస్తూ ఆమె ఎంతో సంతోషంగా ఉన్నారు.
అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లతో ఈ జంట కాసేపు సరదాగా మాట్లాడి ఫోటోలకు పోజులిచ్చారు. వరుణ్ బంగేరా వైట్ షర్ట్, బ్లాక్ ట్రౌజర్స్ ధరించి తన భార్యకు పర్‌ఫెక్ట్ జోడీగా కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. కరిష్మా, వరుణ్‌ల ప్రేమ ప్రయాణం 2021లో ప్రారంభమైంది. అదే ఏడాది ఒక చిన్న వేడుకలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, ఫిబ్రవరి 5, 2022న వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇక కెరీర్ పరంగా చూస్తే.. కరిష్మా తన్నా గత రెండు దశాబ్దాలుగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో టాప్ నటిగా కొనసాగుతున్నారు. ‘క్యుంకీ సాస్ భీ కభీ బహూ థీ’, ‘నాగిన్ 3’, ‘ఖయామత్ కీ రాత్’ వంటి సూపర్ హిట్ టీవీ షోలతో పాటు ‘సంజు’, ‘గ్రాండ్ మస్తీ’, ‘స్కూప్’, ‘కాల్ మీ బే’ వంటి పాపులర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.






