- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > Telugu News > రోడ్డుపై చెత్త వేయొద్దన్నందుకు దారుణం.. పారిశుద్ధ్య కార్మికురాలి జుట్టు పట్టి కొట్టిన మహిళ!
రోడ్డుపై చెత్త వేయొద్దన్నందుకు దారుణం.. పారిశుద్ధ్య కార్మికురాలి జుట్టు పట్టి కొట్టిన మహిళ!
by Jakkula.Mamatha |
కూకట్‌పల్లి దీనబంధు కాలనీలో రోడ్డుపై చెత్త వేయకుండా అడ్డుకున్న పారిశుద్ధ్య కార్మికురాలి పై ఓ మహిళ జుట్టు పట్టి కొట్టి దాడి చేసింది.

X
దిశ, కూకట్‌పల్లి: కూకట్‌పల్లి దీనబంధు కాలనీలో రోడ్డుపై చెత్త వేయకుండా అడ్డుకున్న పారిశుద్ధ్య కార్మికురాలి పై ఓ మహిళ జుట్టు పట్టి కొట్టి దాడి చేసింది. ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలోని దీనబంధు కాలనీలో వడ్డేపల్లి ఎన్క్లైవ్ అపార్ట్మెంట్స్ ముందు ఏపీ 40 ఎల్ క్యూ 1896 వాహనం పై వచ్చిన భార్యభర్తలు రోడ్డుపై చెత్త పారవేస్తుండగా అక్కడే విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకున్నారు. చెత్త వేయొద్దు అన్నందుకు సదరు మహిళ.. కార్మికురాలి పై గొడవ పడి కార్మికురాలిని జుట్టు పట్టుకుని కొట్టి దాడి చేసింది. సంఘటనను అక్కడే ఉన్న మరో కార్మికుడు వీడియో తీయడంతో వీడియో వైరల్ అవుతుంది. ఈ విషయం పై డీసీ చాముండేశ్వరి మాట్లాడుతూ.. వాహనం నంబర్ ఆధారంగా దాడి చేసిన మహిళ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Next Story






