- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోరుట్లలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎమ్మెల్యే వినతి
పట్టణ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని కోరుట్లలో అత్యవసరంగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి శనివారం వినతిపత్రం అందజేశారు.

దిశ, కోరుట్ల రూరల్: పట్టణ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని కోరుట్లలో అత్యవసరంగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కోరుట్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో అగ్ని ప్రమాదాలు, ఇతర అత్యవసర ఘటనలు సంభవించినప్పుడు సమీప ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలు రావడానికి ఆలస్యం అవుతుందని తెలిపారు. దీంతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని, కోరుట్లలో ప్రత్యేక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే అవకాశం ఉండటంతో ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడవచ్చని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కోరుట్లకు త్వరితగతిన ఫైర్ స్టేషన్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు.






