చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’ కే. భాగ్యరాజ్ కన్నుమూత

by Malleboina Mahesh |   (  Updated:2026-06-27 05:30:47  IST  )

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్(73) గుండెపోటుతో కన్నుమూత.. ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’ మృతి పట్ల చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి!

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’ కే. భాగ్యరాజ్ కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ తమిళ నటుడు, స్టార్ డైరెక్టర్ కె.భాగ్యరాజ్ (73) శనివారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ఇంట్లో ఉన్న సమయంలో ఆయనకు అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు రావడంతో, కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ అత్యవసర చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు తెలిపారు. తమిళ సినిమా ఇండస్ట్రీలో ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’గా గుర్తింపు పొందిన భాగ్యరాజ్.. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 75కు పైగా సినిమాల్లో నటుడిగా, 25కు పైగా చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించారు.

తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా భాగ్యరాజ్ (Bhagyaraj) సుపరిచితులే. తెలుగులో సూపర్ హిట్ అయిన 'మేం వయసుకు వచ్చాం' చిత్రంలో హీరో తండ్రిగా ఆయన అద్భుత నటనను ప్రదర్శించారు. వీటితో పాటు 'అవునా', 'రెడ్ అలర్ట్', 'సీత', ఇటీవల విడుదలైన ధనుష్-శేఖర్ కమ్ముల చిత్రం 'కుబేర' తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. భాగ్యరాజ్ అకాల మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Next Story