- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క టికెటైనా అమ్ముతామా అనే భయం వేసింది: సమంత
ఒక్క టికెటైనా అమ్ముతామా అనే భయం వేసిందంటూ మా ఇంటి బంగారం సినిమాపై సమంత కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో దాదాపు 18 సంవత్సరాల నుంచి అగ్రశ్రేణి హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత, చాలా రకాల సినిమాలు చేశారు. లేటెస్ట్ గా మా ఇంటి బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. సినిమా కథ నచ్చడంతో.. థియేటర్లలో చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ మూవీకి కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా ఈ మూవీ సక్సెస్ మీట్ జరిగింది.
ఈ సందర్భంగా హీరోయిన్ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా ఇంటి బంగారం సక్సెస్ డ్రీమ్ లాగా ఉందని వ్యాఖ్యానించారు. ఇలాంటి మూమెంట్ మళ్లీ వస్తుందని అనుకోవడం లేదంటూ పేర్కొన్నారు. గడిచిన మూడేళ్లలో రెండేళ్ల పాటు ఒంటరిగా ఇంట్లో ఉండి, హెల్త్ ఇష్యూస్ తో పోరాడినట్లు వివరించారు. ప్రేక్షకులు కూడా ఈ సినిమాను సక్సెస్ చేసి తనకు పెద్ద గిఫ్ట్ ఇచ్చారని వెల్లడించారు. ఈ సినిమా రిలీజ్ కాకముందు ఒక్క టికెట్ అయినా, అమ్ముతామా? అనే భయం ఉండేదని కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలకు దూరం కావాలని అనుకున్నప్పుడు రాజ్ నిడిమోరు, మా ఇంటి బంగారం కోసం తనను ఒప్పించారని గుర్తు చేశారు.






