- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇడుపు కాయితం’ వివాదంపై రాహుల్ రామకృష్ణ ట్వీట్ వైరల్ !
‘ఇడుపు కాయితం’ వివాదంపై రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రియదర్శి, కొత్త అమ్మాయి నాగదుర్గ జంటగా వస్తున్న సినిమా ఇడుపు కాయితం. తెలంగాణ యాస, భాష ఉట్టిపడేలా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా ఈ మూవీ పోస్టర్ రిలీజ్ అయిన నేపథ్యంలో వివాదం రాజుకుంది. ఈ సినిమాను ఆంధ్ర తెలుగులోకి డబ్బింగ్ చేస్తారా ? తెలంగాణ భాషలోనే ఉంటుందా? మాకు సబ్ టైటిల్స్ వేయండి అంటూ కొంత మంది వక్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నెటిజెన్స్ మధ్య వివాదం రాజుకుంది.
ఇక ఈ కాంట్రవర్సీపై గంటా చక్రపాణి కూడా స్పందించారు. అర్థం కాకపోతే అన్ని మూసుకొని ఉండండి.. ఎలాంటి సబ్ టైటిల్స్ ఉండవు, అసలు మీరు సినిమా చూడకండి అంటూ ట్రోల్ చేసిన వాళ్లకు కౌంటర్ ఇచ్చారు గంట చక్రపాణి. అయితే ఈ పోస్టును ట్యాగ్ చేస్తూ కమెడియన్ రాహుల్ రామకృష్ణ తన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. ప్రియదర్శి సినిమాను ట్రోల్ చేసే వాళ్లకు, సరైన బుద్ధి చెప్పారని గంట చక్రపాణిని మెచ్చుకున్నారు. ఇడుపు కాయితం సినిమా అద్భుతంగా ఉంటుందని, ఈ మూవీలో ప్రియదర్శి అద్భుతంగా నటించనున్నట్లు కొనియాడారు.
నాలుగు ప్రశ్నలు అడిగితే కుదరదు.. మన సినిమాలకు మన కథలను యాక్సెప్ట్ చేయలేరంటూ తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. ఇకపై తమ ప్రాంత ప్రజలకు అర్థమయ్యేలా మాత్రమే సినిమాలు తీస్తామన్న రేంజ్ లో పోస్ట్ పెట్టారు రాహుల్ రామకృష్ణ. దీంతో ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. దీనికి ఏపీ వాళ్లు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నీ సినిమాలు ఆంధ్రావాళ్లు కూడా చూశారని, అందుకే ఈ స్థాయికి వచ్చావని కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమా గురించి వివాదం ఎందుకు ? విడిపోయి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, వాళ్ల మధ్య చిచ్చు పెట్టకండి అంటూ మరికొందరు ఫైర్ అవుతున్నారు. తెలంగాణ, ఏపీలలో నిరుద్యోగ సమస్య ఉంది, దానిపై పోరాటం చేయండి, కానీ ఇలా ప్రాంతాల మధ్య చిచ్చు వదంటూ మండిపడుతున్నారు. క్లిక్






