- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
శ్రీశైల దేవస్థానానికి సూపర్ లగ్జరీ బస్సులు

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి డిపో నుంచి శ్రీశైలం దేవస్థానానికి నూతన సూపర్ లగ్జురీ బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ తెలిపారు. డిపోకు ప్రభుత్వం నూతనంగా నాలుగు సూపర్ లగ్జరీ బస్సులను పంపిందని ఆ బస్సులు శ్రీశైలానికి ప్రతిరోజూ తిప్పనున్నామని ఆయన తెలిపారు. సంగారెడ్డి నుంచి శ్రీశైలంకు ప్రతి రోజూ బస్సులు ఉదయం 4:30కి, ఉదయం 5:30కి, మధ్యాహ్నం 1:00 గం.కు, మధ్యాహ్నం 2:00 గం.లకు బయలుదేరనున్నట్లు ఆయన తెలిపారు.
అదేవిధంగా శ్రీశైలం నుంచి సంగారెడ్డికి ప్రతి రోజూ బస్సులు ఉదయం 4:30కు, ఉదయం 5:30కు, మధ్యాహ్నం 2:00 గం॥ లకు, మధ్యాహ్నం 3:00 గం॥ లకు బయలు దేరుతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని సంగారెడ్డి జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా ముందస్తు రిజర్వేషన్ కొరకు www.tsrtconline.ind సందర్శించాలన్నారు. బస్సులను సోమవారం ఉదయం 10.30 గంటలకు మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారని డిపో మేనేజర్ తెలిపారు.
Read more: