- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధాన్యం కొనలేని ప్రభుత్వానికి రైతులే గుణపాఠం చెబుతారు : : హరీష్ రావు
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, చిన్నకోడూరు : రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వానికి రైతులే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆదివారం మండల పరిధిలోని మల్లారం స్టేజ్ వద్ద రాజీవ్ రహదారిపై రైతులతో కలిసి హరీష్ రావు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిబంధనల పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని, కానీ ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 28 రోజులు గడిచినా వడ్లు కొనడం లేదని రైతులు తన వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మొక్కజొన్న రైతులకు గన్నీ బ్యాగులు అందుబాటులో లేక రైతులే సొంత డబ్బులతో కొనుగోలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. సన్‌ఫ్లవర్ పంట 22 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ ఉందని, ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో మొక్కజొన్న, శనగలు, వడ్లు పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రైతుల గోస తగిలిన ప్రభుత్వం నిలబడదని హెచ్చరించారు. వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు అది బోగస్‌గా మారిందన్నారు. ఎరువులు కొనాలంటే యాప్, వడ్లు అమ్మాలంటే ఆన్‌లైన్ అంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. రాజీవ్ రహదారిపై రైతులతో కలిసి రాస్తారోక నిర్వహించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న చిన్నకోడూరు ఎస్సై చంద్రమోహన్ అక్కడికి చేరుకుని హరీష్ రావుతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కూర మాణిక్యరెడ్డి, జంగిటి శ్రీనివాస్, కీసరి పాపయ్య, రేగుల దేవయ్య, సుంచు ఆంజనేయులు, లంకెల హరీష్, మధుసూదన్ రెడ్డి, ఉమేష్ చంద్ర, కొండం రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యాశాఖను విధ్వంసం చేసేందుకే నీ దగ్గర పెట్టుకున్నావా?.. సీఎంకు కేటీఆర్ లేఖ






