- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యాశాఖను విధ్వంసం చేసేందుకే నీ దగ్గర పెట్టుకున్నావా?.. సీఎంకు కేటీఆర్ లేఖ
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రద్దు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 7 తెచ్చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. వెంటనే జీవో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ను రద్దు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ 7ను తీసుకువచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని 14 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు కొండంత అండగా నిలిచే ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని రద్దు చేసేలా మీరు చేస్తున్న కుట్ర భయంకరమైనదంటూ ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ సీఎంకు కేటీఆర్ లేఖ రాశారు. రెండున్నరేళ్ల అసమర్థ పాలనలో ఇప్పటికే విద్యావ్యవస్థ కుప్పుకూల్చి క్షమించరాన్ని పాపాన్ని మూటగట్టుకున్నారని ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 7 ముమ్మాటికీ ఫీజుల పథకానికి పాతరేసేందుకు వేస్తున్న కుటిల ఎత్తుగడ తెలంగాణ సమాజానికి అర్థమైపోయిందన్నారు. ఈ జీవో వచ్చిన క్షణం నుంచి విద్యార్థులకే కాదు, లక్షలాది మంది నిరుపేద తల్లిదండ్రులకు కూడా కంటిమీద కునుకు కరువైందని పిల్లల భవిష్యత్తుపై గంపెడాశలు పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశలు మీ ప్రభుత్వ దిక్కుమాలిన చర్యలు నీళ్లు జల్లుతున్నాయని ఆరోపించారు. గురుకులాలలో ఇప్పటికే 142 మంది పిల్లలు చనిపోయారని వేలాది మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతూనే ఉన్నారని విమర్శించారు.
వైఎస్సార్ స్కీమ్ కేసీఆర్ కంటిన్యూ:
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ సీఎం వైఎస్సార్ మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ తన హాయంలో కొనసాగించారని గుర్తు చేశారు. గతంలో మీ సొంత పార్టీ ప్రభుత్వం అమలు చేసిన ఫీజుల పథకానికి తూట్లు పొడవడానికి మీకు సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు. విద్యాశాఖను విధ్వంసం చేసేందుకే నీ దగ్గర పెట్టుకున్నావా? రేవంత్ అని ప్రశ్నించారు. దుర్మార్గమైన జీఓ 7ను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని లేదంటే విద్యార్థి లోకం గర్జిస్తే రోడ్లపై తిరగలేరని గుర్తుపెట్టుకోండంటూ హెచ్చరించారు. రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న విద్యార్థుల భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టేలా తెచ్చిన చీకటి జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు.






